13 యేళ్ల బాలికను.. కామాంధులు అత్యంత కిరాతకంగా..?

సమాజంలో రోజురోజుకి కామాంధులు అనే క్రూర మృగాల సంఖ్య ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే.. ఈ క్రూర మృగాల కి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆడది అంటే చాలు వీరిలో కామం మరింత పెరిగి పోయి , చిన్నపిల్లలు అని చూడకుండా అత్యంత కిరాతకంగా అత్యాచారం చేస్తున్నారు. ఇక వీరికి తగ్గట్టుగా మీడియా వర్గాలు కూడా అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. ఇండస్ట్రీలో సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటే , వారాల తరబడి స్పందించిన వాళ్ళు , ఒక ముక్కు పచ్చలారని పసిబిడ్డను అత్యంత కిరాతకంగా చంపిన ఆ మృగాళ్ల పై శిక్ష పడాలి అని ఎందుకు ప్రచారం చేయరు.. మీడియా వాళ్లకు కేవలం సెలబ్రిటీలు మాత్రమే గుర్తుకు వస్తారా ..? సామాన్య ప్రజలు గుర్తుకు రారా..?

- Advertisement -

 

ప్రజల కోసమే మీడియా.. న్యాయం కోసమే మీడియా.. అని చెప్పే మీడియా.. ఎందుకు ఇలాంటి వ్యవహారాలలో ముందడుగు వేయడం లేదు..

ఇక అసలు విషయానికి వస్తే.. భీమవరం సమీపంలోని గాజువాక అనే ప్రాంతం లో 13 సంవత్సరాల బాలికను కొంతమంది క్రూరమృగాలు అత్యంత దారుణంగా హింసించి, అత్యాచారం చేశారు. అంతే కాదు ఆ పాప ఒంటినిండా ఆ దుర్మార్గుల పంటి కాట్లే ఉండడం గమనార్హం. ఆ చిన్నపాప తొడ నుండి కొంత మాంసం ముక్కను కూడా తీశారు. ఇక అత్యంత దారుణంగా ఆ బాలికను హింసించి అత్యాచారం చేసి ,చంపేసిన ఈ దుర్మార్గులు మాత్రం విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు..

ఈ సంఘటన జరిగి రెండు మూడు రోజులు అవుతున్నప్పటికీ, వెలుగులోకి రాకపోవడానికి కారణం ఈ పాప కేవలం ఒక వాచ్మెన్ కూతురు కాబట్టి.. అందుకే ఈ పాపను చంపేసినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు.. కనీసం ఇప్పటికైనా మీడియా గళం విప్పి, ఆ దుర్మార్గులను నాశనం చేయడానికి , ఇలాంటి వాళ్ళు సమాజంలో ఇంకా ఉన్నారు.. పాపాయి జాగ్రత్త..! అని చెప్పడానికి మీడియా.. ముందుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం..

Share post:

Popular