సింగర్ స్మిత.. గురించి తెలియని మరికొన్ని విశేషాలు..!

స్మిత వల్లూరిపల్లి ఈమె అసలు పేరు.కానీ ఈ పేరు చెబితే ఎవరికీ అర్థం కాదేమో..అయితే ఈమెను పాప్ సింగర్ స్మిత అనగానే టక్కున గుర్తు పడతారు.ఇక ఈమె ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించింది.ఈమె చిన్న వయసు నుండి పాటలు పాడడం అంటే చాలా ఇష్టమట. అందుకని ఈమే చదువుకునే రోజుల్లో నే స్కూల్ లో జరిగే వేడుకలలో స్టేజ్ మీద పాటలు పాడి అందరినీ అలరించేది.

అలా స్టేజి మీద పాటలు పాడుతూ ఎన్నో ప్రైజ్ గెలుచుకున్నది ఈ ముద్దుగుమ్మ.ఇక అంతే కాకుండా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గారి పాడుతా తీయగా అనే షోలో పాల్గొన్నది ఈమే. అలా పాల్గొన్న స్మిత కొద్దిరోజుల తర్వాత కొన్ని పాటలు పాడి మంచి పాప్ సింగర్ గా పాపులర్ అయింది.ఇక ఈమె పాడిన మసక మసక చీకటిలో.. అనే పాట ఇప్పటికి కూడా కుర్రకారు లకు పిచ్చెక్కిస్తుంది.

ఈమె సింగర్ గానే కాకుండా వెంకటేష్ తో కలిసి మల్లేశ్వరి సినిమాలో ఒక పాత్రలో నటించింది.ఆ తర్వాత ఆట,శమంతకమణి చిత్రాలలో కూడా కనిపించింది. ఇలా ఎన్నో సినిమాలలో నటించిన ఈమె ఈ మధ్యకాలంలో కనుమరుగైంది.