ఐపీల్ 2021 సెకండ్ ఫేజ్ కు ఆటగాళ్లు డుమ్మా..?

ఐపీఎల్ 2019 సెకండ్ ఫేజ్ ప్రారంభం కావడానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మే 4వ తేదీ ఐపీఎల్ 2021 ని బీసీసీఐ అర్థాంతరంగా వాయిదా వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 19న రెండో దశ ఐపీఎల్ జరగనున్నది. అయితే కొందరు గాయాల కారణంగా, మరికొందరు కోవిద్ ఆందోళన వల్ల రెండోదశ కు దూరం అవుతున్నారు. వీరందరూ కూడా విదేశీ క్రికెటర్లు కావడం గమనార్హం.

పంజాబ్ కింగ్స్ : పంజాబ్ కింగ్స్ జట్టులో రిలే మెరిడిత్, జే రిచర్డ్ సన్ ఈ ఇద్దరు బౌలర్లు రెండోదశ ఆటకు అందుబాటులో ఉండటం లేదని కబురు పంపారు.

రాజస్థాన్ రాయల్స్ : రాజస్థాన్ రాయల్స్ ఇంగ్లాండుకు చెందిన జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ గాయాలు అలాగే ఇతర కారణాల వల్ల జుట్టు కు దూరమయ్యారు.

కోల్ కతా నైట్ రైడర్స్ : ఆస్ట్రేలియాకు చెందిన పేసర్ పాట్ కమిన్స్ రెండో దశ ఐపీఎల్ కు రావడం లేదని సమాచారం పంపాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలకమైన రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ రెండో దశ కు అందుబాటులో ఉంటారో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : అయితే మిగతా వారితో పోల్చుకుంటే రెండవ దశలో ఎక్కువగా నష్టపోతున్నది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. పిన్ అలెన్, స్కాట్ కుగ్లీన్, జోష్ ఫిలిప్, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్ సన్ రెండో దశకు అందుబాటులో ఉండమని చెప్పేశారు.

Share post:

Latest