మెగా మేనల్లుడి ఆరోగ్యం పై నాగబాబు కామెంట్స్..!

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ యక్సిడెంట్ తో గాయపడిన విషయం మనందరికీ తెలిసిందే.ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిందే.సాయి ధరంతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తేజ ఇంకా కోమాలోనే ఉన్నాడు అంటు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో పడేశాయి. ఇక తాజాగా డైరెక్టర్ దేవాకట్ట చేసిన కామెంట్స్ కూడా అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

ఇక దేవాకట్ట తెలిపిన ప్రకారం ఫ్రీ రిపబ్లిక్ ను సాయి ధరంతేజ్ ఈవెంట్ ను లైవ్లో చూశాడని కూడా తెలియజేశాడు.బయట పరిస్థితులు బాగో లేనందువలన ఆయన ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక లాగా డైరెక్టర్ దేవకట్టా ఒక లాగా చెప్పడంతో ఫ్యాన్స్ కి ఏ విషయం నమ్మాలో అర్థం కాలేదు.

అయితే ఇటీవల అభిమానులు నాగబాబుతో చాట్ చేశారట. ఇదే క్రమంలో ఒక నెటిజన్ సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఎలా ఉందండి అని అడగగా దీనికి నాగబాబు.. అతను త్వరగా కోలుకుంటున్నాడు తొందర్లోనే మనం ముందుకు వస్తాడు అని క్లారిటీ గా చెప్పారు.ఈ విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు.

Share post:

Latest