బ్రాండ్స్‌కు తగ్గట్టు సూపర్ స్టార్ రెమ్యునరేషన్.. ?

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఏ సినిమా చేసినా సూపర్ హిట్టు కొడుతుంది. ఆయన సినిమాలు మాత్రమే కాదు యాడ్స్ కూడా చేస్తారు. ఆయన యాడ్స్ కోసం ప్రముఖ కంపెనీలన్నీ కూడా క్యూ కడుతుంటాయి. ఒక్కో సారి ఒక సినిమాకు తీసుకునే మొత్తం యాడ్స్ రూపంలో ఒకసారి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే హీరోలు ఎక్కువగా యాడ్స్ కు మక్కువ చూపుతున్నారు. యాడ్స్ కు ఓ రేంజ్ లో రెమ్యునరేషన్ ఉండటం వల్ల హీరోలు వాటిపై ఎక్కువ ఇంటరెస్ట్ చూపుతుంటారు. ఈ యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో ప్రిన్స్ మహేష్ బాబు నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ మధ్య ఆయన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. అందులోనూ యాడ్స్ లోనూ ఆయన టాలీవుడ్ లో ముందు వరుసలో ఉన్నారు. బ్రాండ్ల విషయంలో బాలీవుడ్ హీరోల మధ్య పోటీ అనేది ఎక్కువగా ఉంది.

కమర్షియల్ యాడ్స్ కోసం ఒక్కదానికి సూపర్ స్టార్ మహేష్ బాబు తీసుకుంటున్న మొత్తం చూస్తే సుమారుగా 5 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు థమ్స్ అప్, సంతూర్, బైజూస్, డెన్వర్ లాంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మరో ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిఫ్ కార్ట్ కి ఆయన బ్రాండింగ్ చేస్తుండటం విశేషం. ఈ కంపెనీకి కూడా మహేష్ బాబు భారీగానే పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. ఇప్పుడు బ్రూవరీస్ కోలా యాడ్లకు అంతకుమించి వసూలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వరుస విజయాలతో ఉన్న స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే అందినంత దండుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. మొత్తానికి మహేష్ ఇంటి ముందు యాడ్స్ కంపెనీలు క్యూ కట్టాయి.

Share post:

Popular