మహా సముద్రం థియేట్రికల్ ట్రైలర్ వచ్చేది అప్పుడే..!

యువ హీరో శర్వానంద్ సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అనుఇమ్మాన్యూయల్ హీరోహీరోయిన్లుగా ఇన్ టెక్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ‘మహాసముద్రం.హీరో శర్వానంద్ ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాప్ ను చవిచూస్తూనే ఉన్నాడు. మరొకహీరో సిద్ధార్థ కూడా ఈ మధ్య కాలంలో ఎటువంటి సక్సెస్ను అందుకోలేదు.

ఈ చిత్రాన్ని’ ఆర్ ఎక్స్ 100’దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సెప్టెంబర్ 23న మహాసముద్రం ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్లో సిద్ధార్థ్, శర్వానంద్ ఇద్దరూ యాక్షన్ అవతారంలో కనిపిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ లకు ఇద్దరు హీరోలు రెడీగా ఉన్నట్లు పోస్టర్ను చూస్తే అర్థమవుతుంది. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇద్దరు హీరోలు ఫ్లాపుల్లో ఉన్నారు ఈ సినిమాతో నైనా మంచి హిట్ ని సంపాదిస్తారు ఏమో వేచి చూడాల్సిందే.

Share post:

Latest