కొరటాల శివను ఆర్థిక ఇబ్బందుల నుండి ఆచార్య సినిమా గట్టెక్కిస్తుందా..?

కొరటాల శివ.. ప్రముఖ నటుడు అలాగే రచయిత అయినటువంటి పోసాని మురళీ కృష్ణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి సినీ ఇండస్ట్రీలో ఉన్న అన్ని మెళకువలను తెలుసుకుని , ఆ తర్వాత దర్శకుడిగా తన సినీ జీవితాన్ని మొదలు పెట్టాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోలకు మంచి విజయవంతమైన చిత్రాలను అందించి వారి ఖాతాలో బ్లాక్ బాస్టర్ సినిమాలను చేరేలా చేశాడు.

ఇటీవల దాదాపు ఒక సంవత్సరం పాటు మెగాస్టార్ చిరంజీవి కోసం ఎదురు చూసి, ఎట్టకేలకు ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కరోనా కారణంగా ఓటీటీలో విడుదల చేయలేక , థియేటర్లలో టికెట్ ధరలు తగ్గిపోవడంతో ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కరోనా కారణంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న కొరటాలశివ, ఆచార్య సినిమాతో మంచి లాభాలు ఆర్జించాలని చూస్తున్నాడు.. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఏం చేయాలో తెలియక తనలోతానే సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కోసం చిరంజీవి మరియు రామ్ చరణ్ భారీ రెమ్యూనరేషన్‌లు తీసుకుంటున్నారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లో రామ్ చరణ్, పూజా హెగ్డే ల మధ్య ఒక సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటోంది. కరోనా పూర్తిగా సద్దుమణిగి టికెట్ల ధర పెంచినప్పుడే సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించాడు కొరటాల శివ.

Share post:

Latest