క్రికెట్ పై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?

జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలె దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ బుల్లితెరపై ఎవరు మీరు కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా వచ్చిన ఎపిసోడ్ లో పాల్గొన్న అభిరామ్ అనే ఒక కంటెస్టెంట్ క్రికెట్ కు సంబంధించిన ప్రశ్న ఎదురయింది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని, కానీ క్రికెట్ చూడాలని ఆసక్తి పోయేలా తన తండ్రి హరికృష్ణ చేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం. కానీ క్రికెట్ నుంచి టీవి లో చూడడం అంటే అస్సలు ఇష్టం లేదు. దానికి గల కారణం మా నాన్న హరికృష్ణ అంటూ తెలిపారు. ఎందుకంటే మా అన్న చిన్నప్పుడు ఉదయం టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్ ను వీసిఆర్ లో రికార్డ్ చేయమని చెప్పేవారు. అది ఎలా చేయాలో కూడా ఆయనే నేర్పించేవారు. దీంతో ఆ మ్యాచ్ నేను పూర్తిగా చూడాల్సి వచ్చేది. తరువాత నాన్నతో కలిసి సాయంత్రం అదే మ్యాచ్ చూసేవాడిని. అలా చూసి చూసి చివరకు క్రికెట్ అంటేనే బోరుకొట్టింది అంటూ తెలిపారు.