గల్లీ రౌడీ ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్..!

సందీప్ కిషన్.. ఈ సినిమాతో తిరిగి మరోసారి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అని చెప్పవచ్చు.. గత కొన్ని సంవత్సరాల క్రితమే సినీ ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ, ఒక్కసారైనా హిట్ కూడా లేకుండా ఆరంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్నాడు.. అప్పుడెప్పుడో అంటూ చెప్పుకునే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మొదటి విజయాన్ని అందుకున్న ఇతడు , ఆ తర్వాత “నిను వీడని నీడను నేనే.. అంటూ వచ్చి మరోసారి విజయ రుచిని చూశాడు.

ఆ తర్వాత ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొంటూనే వస్తున్నాడు.. ఈ సంవత్సరం ఏ వన్ ఎక్స్ప్రెస్ తో వచ్చి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాడు. ఎలాగైనా సరే ఈసారి హ్యాట్రిక్ కొట్టాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది వచ్చిన రెండవ సినిమా గల్లీ రౌడీ. అయితే నిన్న విడుదలైన ఈ సినిమాకు మొదటి షో తోనే మంచి కలెక్షన్లు వస్తున్నాయి.. ఈ సినిమా సాధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ ఏంటో ఒక సారి చూద్దాం..

జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో, కోన ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ గుర్తింపు పొందిన ఎన్ వి వి సత్యనారాయణ నిర్మించారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక రాజేంద్రప్రసాద్ ,బాబీ సింహా, వెన్నెల కిషోర్ ప్రముఖ పాత్రల్లో నటించారు. విడుదలైన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.2.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని,సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకొని సందీప్ కిషన్ నటించిన ఈ సినిమా మొదటి రోజే మిక్స్డ్ టాక్ రావడంతో ఆయన ఆనందం లో ఉన్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా మన తెలుగు రెండు రాష్ట్రాలలో కోటి రూపాయలు గ్రాస్ వచ్చిందని సమాచారం.