దేవిశ్రీప్రసాద్ ఇంట నెలకొన్న విషాద ఛాయలు..!

టాలీవుడ్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక ఈయన పాటలు పాడితే ప్రేక్షకులు ఎంత ఉత్సాహంగా ఉంటారో మనకి తెలిసిన విషయమే. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదఛాయలు చోటుచేసుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ బాబాయ్ బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించే మార్గంలో మరణించినట్లు సమాచారం అయితే ఇంతలోనే దేవిశ్రీ బాబాయి.. బుల్గానిన్ మరణించిన వార్త విని, దేవిశ్రీప్రసాద్ మేనత్త సీతామహాలక్ష్మి గుండెపోటుతో మరణించారు. దీంతో వరుస మరణ వార్తలు విని కుటుంబం తీవ్ర విషాదంలో చోటుచేసుకుంది.

ఇదిలా ఉండగా దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి దాక్కో దాక్కో మేక అనే పాట విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పటి వరకు దేవి శ్రీ ప్రసాద్ పాడిన పాటలు అన్ని ఆ సినిమాలకి హైలెట్ గా నిలిచాయి.

Share post:

Popular