నోరు జారిన షణ్ముఖ్.. హర్ట్ అయిన శ్వేత ఆ తర్వాత?

బిగ్ బాస్ షోలో నామినేషన్స్ తో ఒక్కసారిగా నిప్పులగుండం గా మారింది. అయితే దీనిని చల్లార్చేందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ల మధ్య సరదాగా డ్రామా క్రియేట్ చేసేందుకు హైదరాబాద్ అమ్మాయి – అమెరికా అబ్బాయి అనే ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. పెళ్లి సంబంధం చుట్టూ కొనసాగే ఈ టాస్క్ లో షణ్ముఖ్ జస్వంత్, శ్వేత, లోగో ల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది.

- Advertisement -

వీరి మధ్య సన్నివేశాలు కామెడీగా ఉంటుంది సమయంలోనే షణ్ముఖ్ పొరపాటున ఒక మాట అనడం తో శ్వేత వెంటనే ఎమోషనల్ అవుతుంది.మనం పెళ్లి చేసుకుందాం, ఇకనుంచి నేను నీ వాడిని, నువ్వు నా దానివి అని షణ్ముఖ అనడంతో సిగ్గు తో సరే అంటుంది శ్వేత. ఆ తర్వాత రోబో వచ్చి నువ్వంటే నాకు పిచ్చి, నువ్వే నా ఊపిరి అంటూ ఐ లవ్ యు చెప్పగా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శ్వేత.

ఇదంతా చూసి హర్ట్ అయిన షణ్ముఖ్ ఏదైనా అందాం అనుకుంటే ముఖం మీద పెయింట్ కొడుతోంది అంటూ నోరు జారాడు. దీనితో ఫీలయిన శ్వేత అది ఫన్నీ కాదు అంటూ ఒక్కసారిగా సీరియస్ అయ్యింది. ఇక ఆమెను అనవసరంగా బాధపెట్టాను అనుకుంటూ తన నోటి దురదను తిట్టుకుంటూ శ్వేతాను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికి శ్వేత మాత్రం షణ్ముఖ్ ను క్షమించలేదు.

Share post:

Popular