బెస్ట్ జోడి గా గుర్తింపు పొందిన సమంత – చైతూ జీవితంలో.. ఈ అలజడి ఎందుకు..?

నాగ చైతన్య.. అక్కినేని వారసుడిగా ..నాగార్జున తనయుడుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, జోష్ సినిమా ద్వారా మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా పొందాడు.. ఇక కేరళ కుట్టిగా సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలోకి.. 2010 లో “ఏ మాయ చేసావే ” అనే సినిమాతో అడుగుపెట్టింది.. ఇక ఈ సినిమా ద్వారా సమంత – నాగచైతన్య సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.. ఇక గీతాంజలి సినిమా నాగార్జున జీవితానికి ఎలాంటి టర్నింగ్ పాయింట్ అయితే ఇచ్చిందో..? ఏ మాయ చేసావే సినిమా కూడా నాగచైతన్య – సమంత ల జీవితానికి టర్నింగ్ పాయింట్ ఇచ్చింది.

Watch Ye Maya Chesave | Prime Video

ఇకపోతే నాగచైతన్య అప్పటికే శృతి హాసన్ తో సన్నిహితంగా ఉన్నాడనే వార్తలు రావడం, సమంత కూడా హీరో సిద్ధార్థ తో ప్రేమలో పడింది అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఈ వార్తలన్నింటికి బ్రేక్ పడిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా తరువాత వీరిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉండటంతో మీడియాలో ప్రచారాలు పెద్ద ఎత్తున వచ్చాయి.. ఈ విషయంపై వీరిద్దరూ నోరు మెదపక పోయినా, మీడియా మాత్రం వీరిపై ఫోకస్ చేసిందనే చెప్పాలి.ఒకరోజు నితిన్ , సమంత నటించిన అఆ సినిమా చూసి , వీరిద్దరు థియేటర్ నుంచి బయటకు రావడంతో..మీడియా కంటపడిన వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందని వార్తలు వచ్చాయి.

Samantha Akkineni's reply to fan who asked her to divorce Naga Chaitanya  will leave you in splits

అయితే ఈ విషయం మాత్రం నాగార్జునకు ఏ మాత్రం తెలియదు. నాగార్జున ఆ తర్వాత వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకొని , నాగచైతన్యనే తనతో స్వయంగా చెప్పాలని అనుకున్నాడు. కానీ నాగార్జున ఏమీ తెలియని ప్రేమ వ్యవహారం గురించి అడిగిన ప్రతిసారీ నాగచైతన్య ఏమి చెప్పకపోవడంతో , తన రెండవ కొడుకు అఖిల్ కి ఎంగేజ్మెంట్ కూడా జరిపించడం జరిగింది. ఇకపోతే సమంత ఆటోనగర్ సూర్య, మనం సినిమాలో నాగచైతన్య తో కలిసి నటించింది. అయితే మనం సినిమా తర్వాత వీరి ప్రేమకు దగ్గుపాటి రానా సహాయం చేయడంతో, నాగార్జున ఒప్పుకోవడం 2017 అక్టోబర్ 7వ తేదీన అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.. ఇక ఒకసారి హిందూ సంప్రదాయంలో, మరొకసారి క్రిస్టియన్ సాంప్రదాయంలో ఇలా రెండు రోజులు అతిరథ మహారధుల మధ్యలో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.

Samantha Ruth Prabhu's 'Bold' Role In The Family Man 2 Also A Reason Of Her  Divorce With Akkineni Naga Chaitanya? 50 Crores' Alimony Rumoured

అయితే ఈ వివాహ వేడుకల్లో చాలా ఎమోషనల్ అయ్యింది సమంత. తనను ఎంతో ప్రేమించి, నాగచైతన్య పెళ్లి చేసుకోవడంతో.. ఆమె ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతులు మరొకరు లేరు అని ట్వీట్ కూడా చేసింది. ఇక అంతేకాదు సినీ పరిశ్రమలో ఎంతో సన్నిహితంగా ఉండే జోడి లలో నాగచైతన్య – సమంత జోడి నెంబర్ వన్ స్థానాన్ని చేరుకుంది. వీరిద్దరి ప్రేమ ఎంతలా ఉండేది అంటే , ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలిచిన జోడిగా చెప్పుకోవచ్చు. ఇక పెళ్లి తర్వాత మజిలీ సినిమాలో నటించి ప్రేక్షకులకు కన్నుల పండుగ చూపించారు.

Samantha Akkineni calls Nagarjuna father-in-law in new tweet, fans say 'All  is well' | Entertainment News,The Indian Express

కాకపోతే ఇంతటి సన్నిహితంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ జోడీ, గత కొద్ది రోజులుగా విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తతో రోజురోజుకు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు.. ఇక వీరిద్దరి మధ్య అలజడి ఏర్పడడానికి గల కారణం ఏమిటి..? నిజంగానే సమంత – చైతన్య విడిపోతున్నారా..? గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు వస్తున్నప్పటికీ వీరిద్దరూ ఎందుకు నోరు మెదపడం లేదు..? మీడియా ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం సహజమే కదా అని లైట్ తీసుకున్నారా..? లేక నిజంగానే తమ వైవాహిక జీవితానికి దూరమవుతున్నారా..? ఇందులో ఎంత నిజం ఉందో తెలియక ప్రేక్షకులతో పాటు సినీ ప్రేమికులు కూడా తమ మదిలో కలవరి పడిపోతున్నారు.. ఈ పరిస్థితి ఎంతవరకు దారితీస్తుందో తెలుసుకోవాలంటే వీరిద్దరూ నోరు విప్పక తప్పదు.Akkineni family Christmas: Nagarjuna, Samantha, Naga Chaitanya, Akhil,  Sushanth, Sumanth spend some quality time with family | Telugu Movie News -  Times of India

Share post:

Popular