వరుడు కావలెను సినిమా నుంచి మరొక సాంగ్ రిలీజ్.. మామూలుగా లేదుగా?

టాలీవుడ్ హీరో  నాగశౌర్య, హీరోయిన్ రీతువర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లు టీజర్ లతోపాటు విడుదల అయినా పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి వస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ కాగా, తాజాగా ఈ సినిమా నుంచి మూడవ పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్.

- Advertisement -

‘మనసులోని చిలికిపోయే.. మైమరుపులా మధురిమ ‘ అంటూ సాగే పల్లవితో ఈ మెలోడీ పాట మనసు కు హత్తుకునే విధంగా ఉంది.అంతేకాకుండా ఈ పాటను చిత్రీకరించిన లొకేషన్స్ ఆహ్లాదంగా ఉన్నాయి. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించగా, సింగర్ చిన్మయి మనసుకు హత్తుకునేలా ఈ పాటను ఆలపించింది అని తెలిపారు మూవీ మేకర్స్.ఈ పాటలో హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం అదిరిపోయాయి అని చెప్పవచ్చు.

అలాగే ఈ సినిమాలో హీరో నాగ శౌర్య, హీరోయిన్ రీతూ వర్మ జంట చూడటానికి అందంగా చూడముచ్చటగా కనిపిస్తుంది. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై పిడివి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం.

Share post:

Popular