అచ్చ తెలుగమ్మాయి లా కనిపిస్తున్న కార్తీకదీపం శోభా శెట్టి..?

కార్తీకదీపం సీరియల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి శోభా శెట్టి.ఇక ఈ సీరియల్ లో ఎంతోమంది నటులు బాగా పాపులర్ అయ్యారు.ఈ సీరియల్ 2017 వ సంవత్సరం లో మొదలై ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.అంతేకాకుండా ఈ సీరియల్ పై వచ్చే మీమ్స్ మరి ఏ సీరియల్ కు రావు అనడంలో ఏటువంటి సందేహం లేదు.ఇక ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరు స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్నారు.

ఈ కార్తీకదీపం సీరియల్ లో మౌనిత పాత్ర చాలా కీలకమైనది.ఈ పాత్ర లేకపోతే సీరియల్ లేదు అన్నంతగా ఈ పాత్రను పోషించింది నటి శోభా శెట్టి. ఈమె ఒక కన్నడ ఆర్టిస్ట్.ఇక ఈమె ఈ సీరియల్ లో నటిస్తున్న వంటలక్క.. తో సమానంగా పారితోషకం ని అందుకుంటున్నట్లు సమాచారం.అయితే ఈ సీరియల్ చూసే వారంతా ఆమెని తిట్టుకుంటూ ఉంటారు.కానీ కుర్రకారు మాత్రం ఈమె గ్లామర్ కు పెద్ద ఫాన్స్ గా మారి పోయారు అని చెప్పవచ్చు.

అయితే ఈమెకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి వాటిని ఒక సారిచూసేయండి.