అక్టోబర్ 7న తేలనున్న చైతూ, సామ్ విడాకుల వ్యవహారం.. ఆ రోజే ఎందుకంటే..!

ప్రేమ వివాహం చేసుకున్న అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత విడి పోతున్నారని కొద్దిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ దూరంగానే ఉంటున్నారు. ఇటు లోకల్ మీడియాలో, అటు నేషనల్ మీడియాలో వీరిద్దరి విడాకుల వ్యవహారంపై రోజు వార్తలు వస్తున్నప్పటికీ చైతు కానీ సమంత కానీ ఖండించడం లేదు. కొద్దికాలంగా ఇద్దరు కలిసి బయట కనిపించింది లేదు. ఇటీవల సమంత ఒకటే గోవా టూర్ కి వెళ్లి వచ్చింది.

ఇటీవల లవ్ స్టోరీ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు కూడా సమంత హాజరు కాలేదు. చెన్నైలో కళ్యాణి ప్రియదర్శిని, కీర్తి సురేష్, త్రిషలతో పార్టీలు చేసుకుంటూ కనిపించింది. సమంత అందుబాటులో ఉన్నప్పటికీ లవ్ స్టోరీ ఫంక్షన్ కు హాజరు కాలేదని సమాచారం. దీంతో చైతన్య, సమంత విడాకుల వ్యవహారం నిజమేమోనని చాలా మంది భావిస్తున్నారు.

అయితే వీరిద్దరి దూరం గురించి, విడాకుల వ్యవహారం గురించి అతికొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది. అక్టోబర్ 7వ తేదీ సమంత, చైతన్య పెళ్లి రోజు. ప్రతిసారీ తమ పెళ్లి రోజును ఈ జంట గ్రాండ్ గా చేసుకుంటూ వచ్చింది. ఈసారి కూడా ఈ జంట అక్టోబర్ 7వ తేదీన కలిసి వేడుకలు చేసుకుంటే విడాకులకు సంబంధించిన పుకార్లకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా ఆ రోజు కూడా వారిద్దరూ కలవకపోతే మాత్రం విడాకుల వ్యవహారం పై మరిన్ని అనుమానాలు పెరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా అతి త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.