మరోసారి ప్రయోగాలకు సిద్ధమవుతున్న అరవింద స్వామి..!

అరవింద స్వామి..బొంబాయి , మెరుపు కలలు వంటి ఎన్నో చిత్రాలలో తన నటనను అద్భుతంగా ప్రదర్శించారు. ఇక అంతే కాకుండా రాం చరణ్ తో కలిసి ధ్రువ సినిమా తో సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు అరవిందస్వామి. ఇకపై మరెన్నో ప్రయోగాలతో అలరించనున్నారట ఈయన.

సెల్వ దర్శకత్వంలో వస్తున్న వంగమూడి అనే సినిమాలో అరవిందస్వామి రకరకాల రూపాలలో కనిపించబోతున్నాడట. ఏకంగా ఆ సినిమాలో ఆరు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి విడుదలైన టీజర్ ట్రైలర్ లింక్స్ ని మేకర్స్ ప్రేక్షకులకు అందించారు.

ఇక ఈ చిత్రంలో అరవిందస్వామి అక్బర్ , జగన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఒక పోలీస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో దర్శకుడు అరవింద్ స్వామి గురించి చెబుతూ , ఇందులో అరవింద స్వామి తన తెలివితేటలను ఉపయోగించి , ఒక పోలీస్ కేస్ ను ఎలా చేయించగలిగాడు అనేది ఈ సినిమా స్టోరీ అని తెలియజేశాడు.

అంతే కాకుండా ఈ సినిమా అరవింద స్వామి కెరియర్లో ముఖ్యమైనదిగా అవుతుందని తెలిపారు. ఇక ఈ సినిమాలో సిమ్రాన్-రితికా సింగ్-నందిత శ్వేత- మరికొంతమంది నటించబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాకి ఫోటోగ్రాఫర్ గా గోకుల్ నిర్వహించారు. ఈ సినిమాకి ఆంటోని ఎడిటింగ్ ని అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అరవింద్ స్వామి తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు అన్నట్లు ప్రేక్షకుల నుంచి కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Share post:

Latest