దేవుడు నాకు ఇవి ఇచ్చి తప్పు చేశాడు..సునీత

సింగర్ సునీత..ఈమె గాయకురాలు మాత్రమే కాదు .. ప్రముఖ స్టార్ హీరోయిన్ లకు వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా..ఇక సింగర్ సునీత దేవుడు తమకిచ్చిన కొన్నింటిని దురదృష్టం గా భావిస్తోంది..అందుకు గల కారణం ఏమిటి..అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమెకు భూమాతకు వున్నంత సహనం ఉంది. సునీత కు అందం , అణకువ అనేది పుట్టుకతో వచ్చిన విద్య. అంతేకాకుండా ఆమె పాడే పాటలకు ఎంతో ప్రాణం పోసి పాడినట్టు అనిపిస్తుంది. అంతేకాదు ఎలాంటి వారైనా సరే ఈమె పాటలకు ఫిదా అవ్వాల్సిందే..ఇకపోతే ఈమె తన మొదటి భర్త కిరణ్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే..అయినా తన పిల్లలను ఒంటరితనంతో..వారి జీవితాన్ని తీర్చిదిద్దింది. ఎవరు ఏమని అడిగినా, చిరునవ్వుతో సమాధానం ఇచ్చేది.

ఈమె ఇటీవల ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ లో ఆమె . తన కుటుంబం గురించి ఎన్నో విషయాలను వివరించింది. అలాగే తన పర్సనల్ విషయాలను మీడియాకు చెప్పింది.

సెలబ్రిటీ అంటే కొంతమందిలో చెడు భావం ఉండవచ్చు. కానీ కొంతమంది సెలబ్రిటీల జీవితంలో తిరుగులేని మార్పులు ఉండవచ్చు. కామెంట్లు పెట్టడం మన మాతృదేశంలో ఉన్న అలవాట్లు. అలాగని ఒకవేళ వాళ్ళ కామెంట్స్ రిప్లై ఇవ్వడం వల్ల మళ్ళీ కామెంట్స్ పెట్టరన్న నమ్మకం లేదు. అందువలన వాళ్ళ కామెంట్స్ కు రిప్లై ఇవ్వటం కంటే సైలెంట్ గా ఉండటం బెటర్.. మన జీవితంలో సెలబ్రిటీ లకే కాదు ఇతర వ్యక్తుల పైన కామెంట్ పెట్టడం కామన్ అంటూ సునీత చెప్పుకొచ్చింది.

“ఎందుకంటే నాకు దేవుడు చక్కని గొంతు ఇచ్చాడు. ఇప్పుడు మనం తిట్టడానికి ఉపయోగించకూడదు కదా..! దేవుడు అక్కడికే ఆపేసి ఉండాల్సింది. గొంతుతో పాటు అందం కూడా ఇచ్చాడు. అందుకే వీటి వల్ల నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. దేవుడు ఇలాంటి కొన్ని అవకాశాలు ఇవ్వకుండా ఉండాల్సింది. అంటూ ఆమె తెలిపింది.