దాసరి కుమార్ లపై.. మరొక అట్రాసిటీ కేసు..?

దిగ్గజ దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా , రాజకీయవేత్తగా ఇలా ఎన్నో రకాలుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అప్పట్లో సీరియల్స్ కు కూడా దర్శకత్వం వహించే వారు. అయితే అన్ని రంగాలలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దాసరి నారాయణరావు మనల్ని విడిచి స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఇకపోతే దాసరినారాయణ రావు మరణించిన తర్వాత కూడా ఆయన కుమారుల పై విమర్శలు తొలగడం లేదు. తాజాగా ఇప్పుడు మరో విషయం వార్తల్లోకి వచ్చింది. దాసరి కొడుకు అరుణ్ కుమార్ పై కేసు నమోదు కావటం చర్చనీయాంశమైంది. ఈయనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. దాసరి నారాయణ రావు తీసుకున్న అప్పు గురించి పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

బొల్లారంలోని మారుతి నగర్ కు చెందిన నరసింహులు అనే వ్యక్తి పాత సినిమాలకు రిస్టోరేషన్ టెక్నీషియన్ గా పని చేశాడు. దాసరి నారాయణరావు బతికి ఉన్న సమయంలో ఆయన 2012 నుండి 2016 వరకు దాసరి వద్ద అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా పని చేశారు. దాసరి చనిపోయిన తర్వాత కూడా కొన్ని పెండింగ్ లో ఉన్న వర్క్ లను జూబ్లీహిల్స్ లోని దాసరి నారాయణ ఇంటికి వెళ్లి పనులు పూర్తి చేశాడట.Tussle between Dasari Narayana Rao sons over property dispute spikes up  again

అయితే కొన్ని పనులన్నీ పూర్తి అయిన తరువాత కొడుకు అరుణ్ నరసింహుల తో గొడవ పెట్టుకున్నాడు. డబ్బులు ఇవ్వాల్సిన విషయంలో ప్రభు , అరుణ్ గొడవ పడ్డారట. అప్పటినుంచి డబ్బులు కోసం అరుణ్ ను నరసింహులు అడుగుతూనే ఉన్నాడట.

ఈ మధ్యకాలంలో ఈనెల 13న నరసింహుల ను ఫిలింనగర్ లోనికి ఎఫ్.ఎన్.సి.సి వద్దకు రమ్మని చెప్పాడు. అక్కడికి నరసింహులు వెళ్లగానే కులం గురించి దూషించారు. ఈ విషయాన్ని నర్సింహులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈనెల 16వ తేదీన అరుణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Share post:

Latest