ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్న శ్రీముఖి.. కారణం?

శ్రీముఖి తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు తెలియకుండా ఉండదు. టీవీ రంగంలో తన మాటలతో మాయ చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు బుల్లితెర పై ఎంతో మంది యాంకర్లు ఉన్నా తనకంటూ మంచి గుర్తింపు పొందింది. ఇటు బుల్లితెర పైనే కాదు అటు వెండి తెరపై కూడా తన నటనను కనబరుస్తోంది. ఇక శ్రీముఖి సోషల్ మీడియాలో హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటికే పలు సినిమాల్లో నటించినా శ్రీముఖి ఇటీవల ఒక సినిమాలో నటించింది.

అయితే ఈ సినిమాలో నటించినందుకు గాను శ్రీముఖి బాధపడుతోందట. అయితే ఆ సినిమా ఏదో కాదు. ఇటీవల రిలీజ్ అయిన క్రేజీ అంకుల్స్. ఈమె తాజాగా సీనియర్ నటులతో కలిసి క్రేజీ అంకుల్స్ సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాకు గాను చాలా నెగిటివ్ గా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొంతమంది నెటిజన్లు శ్రీముఖి అనవసరంగా ఈ సినిమా చేసింది అంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. అలాగే క్రేజీ అంకుల్స్ సినిమా శ్రీముఖి కి మైనస్ అయింది అనే మాట వినిపిస్తోంది. అయితే ఇక ముందు ముందు తీయబోయే సినిమాలలో అయినా మంచి పాత్రలు ఎంచుకుంటుందో లేదో చూడాలి మరి.

Share post:

Latest