సినీ ప్రపంచంలో విషాదం..?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎంతోమంది మరణాలను చూశాం. అయితే ప్రస్తుతం కూడా ఒక మలయాళ నటి శరణ్య అనారోగ్య కారణంగా మరణించింది. ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె సోమవారం తుది శ్వాస విడిచినట్లు సమాచారం.

ఈ మలయాళం కుట్టి కి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తెలిసినప్పటి నుంచి శరణ్య కు 11 పెద్ద శస్త్రచికిత్సలు చేశారట. కానీ ఆ సమయంలోనే తీవ్ర ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టడంతో, ఆమెకు ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు సహాయం చేశారట. కానీ కొద్ది రోజుల క్రితం ఆమెకు కరోనా సోకడంతో మరియు ఆరోగ్యంగా దెబ్బతినడంతో నిమోనియా అనే వ్యాధి సోకడం ద్వారా, రక్తంలో ఉండేటువంటి సోడియం లెవెల్స్ పడిపోవడంతో కొన్ని రోజులపాటు ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటూ ఉంది.

కానీ కరోనాతో కోలుకున్న కొద్దిరోజులకి..మరొక ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి పోయి మరణించింది. ఆమె మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదిక ద్వారా నివాళులర్పిస్తారు. ఇక కేరళ ముఖ్యమంత్రి కూడా ఆమెను గుర్తు చేసుకుంటూ ఆమె కు సంబంధించి ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో విడుదల చేశాడు.

వరద బాధితుల సమయం లో ఆమె ఎంతో సహాయం చేసిందని, ఎన్నో సేవా, పనులు చేసిందని అలాంటి వ్యక్తి మరణించడం చాలా బాధాకరంగా ఉందని తెలియజేశారు. ఈమె మలయాళం లోని పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న శరణ్య సినిమాల్లో కూడా నటించింది.

Share post:

Latest