బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిన సుధీర్..

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ బిగ్ బాస్ షో గురించి హడావిడి మొదలైంది. బుల్లితెరపై అత్యధికంగా టిఆర్పి రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతున్న, ఈ షోకి ఎంతో మంది సెలబ్రిటీలు ఓకే ఇంట్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ నాలుగు సీజన్ లను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకుంది.ఇక త్వరలోనే సీజన్ ఫైవ్ కూడా మొదలు కాబోతోంది.

ఇక ఇప్పటికీ బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ లోకి కంటెస్టెంట్ ల లిస్ట్ ను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇదే తరుణంలో బుల్లితెరపై బాగా పాపులర్ సంపాదించిన జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ కు కూడా బిగ్ బాస్ ఒక అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తున్నది.అదేంటో చూద్దాం..

బిగ్ బాస్ షో సెప్టెంబర్ 5వ తేదీన ప్రసారం కాబోతుందని, ఎక్కువగా ప్రచారం జరుగుతోంది.
ఇక అంతే కాకుండా కంటెస్టెంట్ లిస్ట్ కూడా వెలువడ్డాయని, ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాపులర్ అవుతూనే ఉంది. కంటెస్టెంట్ లపై దృష్టి పెట్టేందుకు బిగ్ బాస్ సంస్థ 50 మందితో ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ జరిగింది. బిగ్ బాస్ సెట్టింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక ఇందులో ఎంతో మంది యాంకర్లు, నటులు పాల్గొంటున్నట్లు తెలుస్తున్నది.

ఇక తాజాగా సుధీర్ ని కూడా ఇందుకోసం తీసుకుంటున్నట్లు ఎక్కువగా ప్రచారం జరుగుతున్నది. అందుకోసం బిగ్ బాస్ భారీ నజరానానే రెమ్యునేషన్ కింద 4.50 కోట్ల రూపాయలను ఆఫర్ చేసినట్లు సమాచారం. అంటే ఇంత పెద్ద మొత్తాన్ని మొదటిసారిగా బుల్లితెర లో నటించేవారికి ఆఫర్ చేయడం. అయితే ఈ షో లో సుధీర్ పాల్గొంటాడా? లేదా..? అన్న విషయం త్వరలోనే తెలుస్తుంది.