స్టూవర్ట్‌పురం బాబు ల్యాండ్ అవుతున్నాడు..!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలో తనకంటూ ఎలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. మాస్ యాక్షన్‌ను తనదైన మార్క్‌తో ప్రేక్షకుల ఊహలకు అందకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ హీరో ప్రస్తుతం బాలీవుడ్‌వైపు అడుగులు వేస్తు్న్నాడు. గతంలో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ డైరెక్షన్‌లో రెడీ చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే తెలుగులో తన నెక్ట్స్ చిత్రాన్ని తాజాగా అనౌన్స్ చేశాడు ఈ హీరో.

‘స్టూవర్ట్‌పురం దొంగ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పోస్టర్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ తన కొత్త చిత్రాన్ని కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశాడు. ఈ సినిమా 1970లో పేరుమోసిన ఘరానాదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవితగాధ ఆధారంగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం బెల్లంకొండ బాబు పూర్తిగా తన లుక్‌ను ఛేంజ్ చేస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. కాగా ఈ సినిమాను వివి వినాయక్ శిష్యుడు కెఎస్ డైరెక్టర్‌గా మారి చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అప్పుడే అందరిలో మొదలైంది. ఇక ఈ సినిమాలో భారీ తారాగణంతో పాటు పలు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండబోతుటన్నట్లు తెలుస్తోంది. మరో విశేషమేమిటంటే ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తిరిగి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. మరి ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Popular