అవసరాల అందగాడు వెనక్కి వెళ్ళిపోయాడు..

బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఇక అలాంటప్పుడు కొన్ని సినిమాలు ఒక సారి పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి దిశలో కొంత మంది హీరోలకు, నిర్మాతలకు ఇగోలు అడ్డు వస్తు ఉంటాయి. తాము ఎందుకు తగ్గాలి అన్న ఉద్దేశంతోనే కొంతమంది ఆలోచిస్తుంటారు. కానీ మరికొంతమంది మటుకు వెనక్కి తగ్గితే భయపడినట్టు కాదు.. కానీ అందరి మంచి కోసమే అని కొంతమంది చెబుతూ ఉంటారు.

అయితే ఈ నెల చివరి వారంలో హడావుడిగా 3 సినిమాలు విడుదల కాబోతున్న ట్లు ప్రకటించడం జరిగింది. అందులో ఒకటి శ్రీదేవి సోడా సెంటర్. నూటొక్క జిల్లాల అందగాడు, ఇచ్చట వాహనాలు నిలుపరాదు. ఈ మూడు చిత్రాల మీద ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఉండేవారు. వెరైటీ స్టోరీలతో ఆయా చిత్రాలు వాటి నిర్మాణాల్లో బాగానే నమ్మకం కలిగిస్తున్నాయి.

Pic Talk: Srinivas Avasarala turns into Gotti Surya Narayana in 'Nootokka  Jillala Andagadu' | Telugu Movie News - Times of India

ఇక ఈ మధ్య కాలంలో థియేటర్ లలో సినిమాలు ఎక్కువగా విడుదలవుతున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో.. క్రిస్-దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న నూటొక్క జిల్లాల అందగాడు సినిమా రేస్లో నుంచి తప్పుకోవడం వల్ల, సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా గుసగుసలాడుకుంటున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నట్లు నిర్ణయించుకున్నారు.

అయితే ఈ విషయాన్ని మామూలుగా చెప్పకుండా హీరో అవసరాల ముఖ భాగంగా ఉన్న స్టిల్ ఒకటి విడుదల చేసి, నూటొక్క జిల్లాల అందగాడు అలిగాడు అని, ఒక వారం రోజులపాటు లేటుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి కనువిందు చేస్తాడు అని , ఫన్నీ పోస్టర్ ను విడుదల చేశారు. పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారనే విషయం చిత్ర బృందాన్ని అడగగా.. కొన్ని అనివార్య పరిస్థితులలో సినిమాను వాయిదా వేయవలసి వచ్చింది అని చెప్పడం జరిగింది. ఇక అంతే కాకుండా ఈ చిత్రబృందం ఒకేసారి ఎన్ని సినిమాలు విడుదల అయితే ఎలా అని ..దాంతోనే కాస్త వెనక్కి తగ్గినట్లు చెప్పడంతో నెటిజన్లు ఈ చిత్ర బృందం పై అభినందిస్తున్నారు.