ఆడపిల్లలు త్వరగా మెచ్యూరిటీ అవ్వడానికి కారణం ఇదేనా..?

సాధారణంగా పూర్వ కాలంలో అమ్మాయిల మెచ్యూరిటీ వయసు 12 సంవత్సరాలు లేదా 13 సంవత్సరాల..ఆ వయసు తర్వాత వారు యుక్తవయసుకు రావడం జరుగుతుంది. కానీ ఇటీవల కాలంలో ఆడపిల్లలు ఎనిమిది సంవత్సరాలు కూడా పూర్తిగా నిండకుండానే మెచ్యూరిటీ అవుతున్నారు. ఇక ఒకసారి ఆడపిల్ల మెచ్యూరిటీ అయిందంటే, రుతుక్రమం తో ప్రతి నెల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు పాల బుగ్గల పసిడి పిల్లలు ఏమీ తెలియని వయసులో ఉన్న వీరు, రుతుక్రమం వస్తే ఏం చేయాలో తెలియక..ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వారిలో వారే మానసిక క్షోభను అనుభవిస్తున్నారు..

- Advertisement -

ఇలాంటి కాలంలో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అందుకు ప్రధాన కారణం ఆహారం కల్తీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా పిల్లలకు ఇచ్చే ప్యాకెట్ పాల వల్ల ఈ కల్తీ ఎక్కువగా జరుగుతోంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎక్కడచూసినా పాలు ,పాల ఉత్పత్తులు వినియోగం ఎక్కువ అవుతున్న తరుణంలో , పాలను ఉత్పత్తి చేసే వారు కూడా తక్కువ అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మార్కెట్లో దొరికే పాల పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా ఎన్నో పేరుమోసిన కంపెనీలు కూడా వీటి విషయంలో కల్తీ చేస్తున్నారనే వార్తలను మనం తరచూ చూస్తూనే ఉన్నాం.

ఇలాంటి కల్తీ పాలు, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి తీసుకోవడం వల్ల ఆడపిల్లలు త్వరగా మెచ్యూరిటీ దశకు చేరుకుంటున్నారు. అంతేకాదు సహజంగా ఆవు లేదా గేదె నుంచి తీసుకున్న ఆవు పాలను సేవించడం వల్ల పాల ద్వారా యాంటీబయోటిక్స్ మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి. కాబట్టి వీరికి సీజనల్ జ్వరాలు వచ్చినప్పుడు యాంటీబయోటిక్ ఇంజెక్షన్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఇకపోతే ఏదైనా జలుబు కానీ, జ్వరం కానీ వచ్చినప్పుడు ఇంజెక్షన్ల రూపంలో, ఈ యాంటీబయాటిక్స్ ను శరీరానికి ఇవ్వడం వల్ల శరీరంలో వీటి నిలువ ఎక్కువ అయ్యి, అనారోగ్యం పాలు కావలసి వస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల్లో పీసీఓడీ సమస్య అధికమై.. వారు జీవితకాలం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆడ పిల్లలపై తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ చూపి, వారి ఆరోగ్యం వైపు శ్రద్ధ వహించాలి.

Share post:

Popular