ఆ రూమర్లను సమంత ఒప్పుకున్నట్టేనా..?

సమంత పెళ్లికి ముందు పెళ్లికి తరువాత అనే మాటల తో సంబంధం లేకుండా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఆమె తన మామ నాగార్జున తో సమానంగా డబ్బులను సంపాదిస్తోంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈమె సినిమాలను మాత్రమే కాదు , వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, ఇటీవల బుల్లితెర పై కూడా ఒక ప్రోగ్రామ్ ను నిర్వహిస్తోంది..

సమంత మొన్నటి వరకు అక్కినేని సమంత గా మారి, ఇప్పుడు అనుకోకుండా తన సోషల్ మీడియా నుండి తన పేరు ముందు ఉన్న అక్కినేని అనే పేరును తొలగించింది. కానీ ఇప్పుడు కేవలం ఎస్ అనే అక్షరం నుంచి మిగతాది మొత్తం తొలగించింది. ఎస్ అక్షరంతో సమంత అనే పేరు వస్తుంది. ఇక అక్కినేని అనే పేరును కూడా తొలగించడంతో నెటిజన్లు రకరకాలుగా ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.. సమంత అనుకోకుండా ఇలా తన ఇంటి పేరును తొలగించడంతో అందరూ అనుమానం కూడా వ్యక్తపరుస్తున్నారు.

కానీ ఈ రూమర్స్ పై ఈమె మౌనం వహించడం తో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే.. ఈమె తన పేరును అలా కుదించడం వెనుక ఒక యాడ్ ప్రమోషన్స్ ఉందని తెలుస్తోంది. సమంత ఒక ఫ్యాషన్ లేబుల్ కలెక్షన్స్ ప్రమోషన్స్ కోసం మాత్రమే , తన పేరును ఇలా కుదించి , ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా కొన్ని కోట్ల రూపాయలను సంపాదిస్తున్న సమంత, కేవలం ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు లక్షల రూపాయలు వస్తాయట. అందుకే ఈమె తన ట్విటర్ యాక్టివిటీను తగ్గించి, పూర్తిగా ఇంస్టాగ్రామ్ పైన తన ఫోకస్ పెట్టింది అని సమాచారం.

ఇక ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఇక ఇందులో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా నటించడం గమనార్హం.