9 పాత్రలతో మెప్పించిన జగ్గు భాయ్..?

టాలీవుడ్ లోకి స్వప్న లోకం మూవీతో హీరోగా అడుగుపెట్టిన ప్రముఖ నిర్మాత వి బి రాజేంద్ర ప్రసాద్ కొడుకు జగపతిబాబు. ఈయన మొదటి సినిమాతో మంచి పేరును దక్కించుకున్నాడు. ఆ తరువాత కొన్ని సినిమాలలో అవకాశం దక్కించుకుని, కొన్ని కొన్ని పాత్రలను పోషించి అంచెలంచెలుగా ఎదిగాడు.

1990లో ఈయనకి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ సక్సెస్లను సాధించిపెట్టాయి. ఇక ఇటీవల బాలయ్యతో లెజెండ్ సినిమాలో నటించిన తన పాత్ర కానీ, రంగస్థలం మూవీలో తన పాత్ర గురించి కానీ ఇక చెప్పనవసరమే లేదు. ఇక జగపతి బాబు కొత్తగా విలన్ పాత్రకు బాగా సెట్ అయ్యాడు. చెప్పాలంటే ఆయనకు ఈ మధ్య కాలంలో విలన్ పాత్రలు బాగా సెట్ అవుతున్నాయి. ఈయన విలన్ గాను, హీరో గాను అన్ని రకాలగా సినిమాలలోని పాత్రలకు బాగా సెట్ అవుతాడు. కానీ కొన్ని పాత్రలకు ఇంకా బాగా సెట్ అవుతాడు.

ఇక ప్రస్తుతం జగ్గు భాయ్ నటించబోతున్న 9 సినిమాలు ఆర్డర్ లో ఉన్నాయి. వాటిలో ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ తీస్తున్న భారీ సినిమాలలో సాలార్ లో రాజ్ మనాల్
అనే రోల్ ని చేస్తున్నారు. ఇప్పుడు రాబోతున్న నాని సినిమాలో జగపతి బాబు సోదరుడి పాత్రను పోషిస్తున్నాడు. అజయ్ భూపతి తీస్తున్న సినిమాలో ఒక కీలక క్యారెక్టర్ ను జగపతిబాబు చేయబోతున్నాడు.

అంతేకాకుండా వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తున్న గని సినిమాలో నటించబోతున్నాడు. రిపబ్లిక్ సినిమా సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో మెయిన్ రోల్ పోషిస్తున్నారు. ఇక మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా తో శ్రీరామ్ ఆదిత్య తీస్తున్న సినిమాలో కూడా ఒక ముఖ్యమైన రోల్ పోషిస్తున్నాడు.

అంతేకాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించబోతున్నాడు. శివ తీస్తున్న అన్నాతై మూవీ లో కూడా ఒక మెయిన్ రోల్ చేస్తున్నాడు. జగపతిబాబు నటిస్తున్న ఈ సినిమాలు సక్సెస్ అయితే, నటుడిగా ఆయన క్రేజ్ మరింత పెరుగుతుంది అని అంటున్నారు ప్రేక్షకులు అలాగే ఇండస్ట్రీ వర్గాల వారు.

Share post:

Latest