రాజకీయాల్లోకి కరాటే కళ్యాణి ఎంట్రీ..?

వెండితెర నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు చాలా మందే ఉన్నారు. ఎన్టీఆర్ నుంచి మొదలుకుని పవన్ కల్యాణ్ వరకు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. కాగా కొందరు సినీ ఆర్టిస్టులు మాత్రమే రాజకీయాల్లో సక్సెస్ అయ్యారన్నది వాస్తవం. తాజాగా కరాటే కళ్యాణి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీలో జాయిన్ అవుతున్నట్లు ఆమె ప్రకటించారు. బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ సమక్షంలో కరాటే కళ్యాణి బీజేపీలో చేరారు.

జల్ పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్‌తో పాటు పలువురు జైన్ కమ్యూనిటీ నేతలు కూడా కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక కరాటే కళ్యాణిని బండి సంజయ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించగా, బీజేపీ మహిళా నేత విజయశాంతి శాలువా కప్పి సన్మానించారు. కరాటే కళ్యాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌‌‌గా పలు సినిమాల్లో నటించిన సంగతి అందరికీ విదితమే. ఇటీవల రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 4’లోనూ పార్టిసిపేట్ చేసింది కరాటే కళ్యాణి. అయితే, తెలంగాణ రాజకీయాల్లో కరాటే కళ్యాణి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి..

Share post:

Latest