పవన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త…!

చక్కని కథతో రూపొందిన “వకీల్ సాబ్” చిత్రంలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక తమన్ అందించిన సంగీతం కూడా హైలెట్ అయ్యింది. అయితే ఏప్రిల్ 9, 2021న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. మూడు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలయ్యింది.

అయితే ఈ సినిమా త్వరలోనే బుల్లితెర వేదికగా కూడా విడుదల కాబోతోందని తెలుస్తోంది. జీ తెలుగు ఛానల్ వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసిందని.. జులై నెల 11న లేదా 17వ తేదీన ప్రసారం చేయనుందని టీవీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే థియేటర్లలో, ప్రైమ్ వీడియోలో విడుదలై భారీ హిట్టయిన వకీల్ సాబ్ చిత్రం బుల్లితెరపై ఏ స్థాయిలో హిట్ అవుతుందో, ఎంత టీఆర్పీ రేటింగ్ సాధిస్తుందో చూడాలి.

Share post:

Popular