గొర్రెల పంపిణీ కోసం ప్రత్యేక యాప్‌..!?

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు గత ఏడేళ్ల పాలన చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే పలు వర్గాలకు మేలు చేసేందుకు కొత్త పథకాలను రూపొందించింది. అలా యాదవులు, గొళ్ల, కురుమ సామాజిక వర్గాలకు మేలు చేసేందుకు గాను ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిది. ఈ క్రమంలోనే రెండో విడత గొర్రెల పంపిణీని మరింతక పకడ్బందీగా చేపట్టాలని సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. గొర్రెల సప్లైలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా ఉండేందుకు, నిత్యం పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. ఇందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా పశుసంవర్థకశాఖ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.

అర్హులైన ప్రతీ ఒక్కరికి 21 గొర్రెలు అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ యాప్ ద్వారా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు. ఎప్పటికప్పుడు రికార్డు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు యాప్‌లో లైవ్‌ లొకేషన్‌ ఫొటోఫీచర్‌ను అందుబాటులో ఉంచారు. తద్వారా కొనుగోళ్ల వద్ద, గొర్రెలను లోడ్‌చేసే సమయంలో, ఇక్కడ అన్‌లోడింగ్‌తో పాటు లబ్ధిదారులకు పంపిణీ చేసే సమయంలో ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇక ఈ యాప్‌ లైవ్‌ ఫొటోలను మాత్ర‌మే స్వీకరిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి రెండో విడతలో భాగంగా సుమారు 3.80 లక్షలను గొర్రెలను సర్కారు పంపిణీ చేయనుంది. గొర్రెల కొనుగోళ్ల విషయమై వెటర్నరీ డాక్టర్లు కాకుండా ఈ సారి ఏడీలను వేరే రాష్ట్రాలకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.