శృంగార సాంగ్స్ సింగర్ మీకు తెలియని నిజాలు ఇవే..!

ఎల్. ఆర్ ఈశ్వ‌రి ఈ పేరు వింటే శ్రోత‌ల గుండె గ‌దుల్లో అల‌జ‌డి వినిపిస్తుంది. త‌న శృంగార గీతాలతో కుర్ర‌కారును కైపు ఎక్కిస్తుంది. సి.నారాయ‌ణ‌రెడ్డి, ఆరుద్ర లాంటి వారు ముద్దుల గాయ‌ని అని పిలిచేవారు.
రొమాంటిక్ పాట‌ల‌తో శ్రోత‌ల‌ను అల‌రించేవారు. ఎల్‌.ఆర్‌. ఈశ్వ‌రి మ‌ద్రాసులో జ‌న్మించారు. ఆమె అస‌లు పేరు లూర్ట్ మేరీ ఇంట్లో వారు కూడా అలానే పిలిచేవారు. హిందు దేవ‌త‌ల్నీ పూజించే నాన‌మ్మ గారింట్లో ఆమెను రాజేశ్వ‌రి అని ముద్దుగా పిలిచేవారు. త‌మిళ సినిప‌రిశ్ర‌మ‌లో అప్ప‌టికే రాజేశ్వ‌రి అనే పేరుతో ఒక గాయ‌ని ఉండ‌డంతో ద‌ర్శ‌కుడు ఏపి నాగ‌రాజ‌న్ ఆమెకు ఎల్‌.ఆర్ ఈశ్వ‌రిగా పిలిచేవారు.

ఎల్‌.ఆర్‌. ఈశ్వ‌రి అమ్మ‌గారు నిర్మ‌ల‌, ఆమె కూడా సినిమా పాట‌ల‌కు కోర‌స్ పాడేవారు. చ‌దువుకునే రోజులోనే ఈశ్వ‌రి ఆమె త‌ల్లితో పాటు పాట‌ల రికార్డింగ్‌కు వెళ్లేంది. అలా ఆమె ప్ర‌స్థానం మొద‌లై మ‌హ‌దేవ‌న్ న‌ల్ల ఇడ‌త్తు సంబంధం అనే చిత్రంలో పాడేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తొలిసారి ‘అనుబంధాలు’ (1963). త‌రువాత‌ టి.వి. రాజు స్వ‌ర‌క‌ల్ప‌న‌లో ‘శ్రీ సింహాచ‌ల క్షేత్ర మ‌హిమ‌’లో పాడిన పాట‌లు ఎంతో పేరు తెచ్చాయి. ఆమె పాడిన “లేలేలే లేలేలే నా రాజా… లేవనంటావా నన్ను లేపమంటావా” (ప్రేమ‌న‌గ‌ర్‌) పాట ఇప్ప‌టి ఎవ‌రూ మ‌ర్చిపోరు. ఆమె గొంతులోనే కైపు ఎక్కించే గాత్రం ఉండ‌డంతో మంచిపేరు తెచ్చింది.