వాట్సప్ మనిషి జీవితంలో భాగమైపోయింది. రోజంతా తిన్నకుండా ఉంటారేమో గానీ, ఒక్క నిమిషం వాట్సప్ చూడకుండా ఉండలేరు. టెక్నాలజీ పెరిగిన కొద్ది సైబర్ క్రైమ్స్ పేరుగుతున్నాయి. కొంత మంది అవతలి వ్యక్తి వాట్సప్ బ్లాక్ చేస్తున్నారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి. సమస్య ఎలా పరిష్కరించుకోవాలి అని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. వాట్సప్ బ్లాక్ చేసినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాట్సప్ చాట్‌లోకి వెళ్లి చూడండి. వారి లాస్ట్ చూడండి. లాస్ట్ సీన్ కనిపించకపోతే బ్లాక్ చేశారని అనుమానించవచ్చు.
కొంత మంది అయితే సీన్ డిసేబుల్ పెట్టుకుంటారు. ఈ సమయంలో వారు వాట్సప్ బ్లాక్ చేసినట్టు కాదని గుర్తించాలి. వాట్సప్ నుంచి అవతల వ్యక్తికి వాట్సాప్ కాల్ ఆడియో లేదా మీడియో ఏది చేసినా కలవడం లేదు అంటే బ్లాక్ చేసినట్టు గుర్తించాలి. కొన్ని సార్లు నెల్ వర్కర్ లేకపోయినా కలవకపోవచ్చు.
వాట్సప్ వాడుతున్న వారికి ఇలాంటి సమస్య ఉంటే, మీ వాట్సప్‌ను బ్లాక్ చేశారా లేదా అన్నది తెలుసుకోవచ్చు. మీ వాట్సప్ ఎవరైనా బ్లాక్ చేశారని అనుమానిస్తే ఆ వ్యక్తి మొబైల్ నెంబర్ తో ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించండి. గ్రూప్ క్రియేట్ అయితే అవతలి వ్యక్తి మీ వాట్సప్ బ్లాక్ చేయనట్టు గుర్తించాలి, గ్రూప్ క్రియేట్ కాకపోతే కుడ్ నాట్ యాడ్ నంబర్ లేదా నేమ్ అని వస్తే అవతలి వ్యక్తి మీ వాట్సప్‌ను బ్లాక్ చేసినట్టు గుర్తించాలి.