హీరో మహేష్ బాబు కొడుకు ఆ విషయంలో గ్రేట్..?

టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరైనా ఉన్నారంటే టక్కున అది ప్రిన్స్ మహేష్ బాబు అనే చెబుతారు. అమ్మాయిలకు ఆయనొక రాకుమారుడు, మాస్ ఫాలోయింగ్ ఉంది. క్లాస్ ఇమేజ్ ఉంది. హీరో మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఒకప్పటి హీరోయినే. అయితే ఆమె పెళ్లి తర్వాత సినిమాలు చేయడం లేదు. తాను సినిమాలు చేయకపోయినప్పటికీ పిల్లలను చూసుకుంటూ వారి విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా నమ్రత ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

తమ సుపుత్రుడు గౌతమ్ ఘట్టమనేని ఈతల పోటీల్లో గొప్ప స్థానాన్ని అధిగమించాడు. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్‌ పోటీలో టాప్ 8లో నిలవడంతో ఆయన శుభకర విషయాన్ని నమ్రత అందరికీ తెలియజేసింది. ఈతగాళ్ళ లిస్ట్ లో గౌతమ్ ఇలా ర్యాంకును సాధించడం గొప్ప విషయమని తెలిపింది. 15 ఏళ్ల గౌతమ్ ఆయుష్ యాదవ్‌ అనే శిక్షకుడి వద్ద స్విమ్మింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈతల పోటీల్లో నిపుణుడు అయిన ఆయుష్ యాదవ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణతో కలిసి రాష్ట్ర కోచ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గౌతమ్ కు ఇలా గుర్తింపు రావడం పట్ల నమ్రత ఆనందం వ్యక్తం చేశారు.

Share post:

Latest