రూ.1కే ఇయర్ బడ్స్..లావా లాంఛింగ్ ఆఫర్ అదిరింది!

రూ.1కే ఇయ‌ర్ బ‌డ్స్. అది కూడా వైర్ లెస్ ఇయర్ బడ్స్‌. న‌మ్మ‌స‌క్యంగా లేక‌పోయినా.. మీరు విన్న‌ది నిజ‌మే. ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ లావా ఈ అదిరిపోయే ఆఫ‌ర్‌ను అందించింది. బ‌డ్జెట్ రేంజ్ మొబైల్స్‌ను త‌యారు చేస్తూ వినియోగ‌దారుల‌కు బాగా ద‌గ్గ‌రైన లావా.. వైర్‌లెస్ విభాగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది.

లావా ప్రోబడ్స్ పేరుతో మార్కెట్లోకి రానున్న ఈ ఇయర్ బడ్స్ అస‌లు ధ‌ర‌ రూ. 2199గా ఉంది. లాంఛింగ్ ఆఫర్‌లో రూ.1కే లభించనున్నాయి. జూన్ 24న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. లావా ఇ-స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో లావా ప్రోబడ్స్ కొనొచ్చు. అయితే నిర్ణీత స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్‌కు లావా ప్రోబడ్స్ లభించనున్నాయి.

ఇక లావా ప్రోబడ్స్ ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. లావా ప్రోబడ్స్‌లో 11.6ఎంఎం అడ్వాన్స్‌డ్ డ్రైవర్స్ ఉంటాయి. ప్రతి ఇయర్‌బడ్ లోపల 55 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు ఛార్జింగ్ కేసు లోపల 500 ఎంఏహెచ్ బ్యాటరీ మద్దతు ఉంటుంది. మీడియాటెక్ ఎయిరోహా ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. అలాగే లావా ప్రోబడ్స్‌లో వేక్ అండ్ పెయిర్ టెక్నాలజీ ఉంది. లేటేస్ట్‌ బ్లూటూత్ వీ5, ఐపీఎక్స్5 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక వీటి మొత్తం బరువు 77 గ్రాములు మాత్రమే.