ఇండియా కెప్టెన్ గా శిఖర్ ..?

టీమ్ ఇండియా వ‌రుస ట్రిప్పులకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా త్వ‌ర‌లో ప్రారంభమయ్యే శ్రీలంక పర్యటన షెడ్యూల్ ను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ లో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు ప్లాన్ చేసింది. అయితే ఈ టీమ్‌లో శిఖర్‌ ధావన్ కెప్టెన్‌గా యువ బృందం ఆడ‌నుంది. ఈ విషయాన్ని సోనీస్పోర్ట్స్ ఛాన‌ల్ అధికారికంగా ట్విటర్ ద్వారా స్ప‌ష్టం చేసింది. ఇక ఇందులో విడుదల చేసిన షెడ్యూల్ చూస్తే… వ‌చ్చే జులై 13, 16, 18 తేదీల్లో మూడు వన్డేలు ఆడ‌నుంది ఇండియా.

ఇక ఆ త‌ర్వాత జులై 21, 23, 25 తేదీల్లో మూడు టీ20లు జ‌రుగుతాయని తెలుస్తోంది. ఇక రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న మెయిన్ టీమ్ కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో వాలింది. అక్క‌డ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ లో త‌ల‌ప‌డ‌నుంది. అలాగే ఆగస్టులో ఇంగ్లండ్ తో జ‌రిగే ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే జులైలో రాహుల్‌ ద్రవిడ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న శిఖర్‌ ధావన్ టీమ్ లంక పర్యటనకు రెడీ అయింది.

Share post:

Popular