ఇమ్మాన్యుయేల్‌ను పెళ్లాడిన వ‌ర్ష‌..మండిప‌డుతున్న నెటిజ‌న్లు!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా సూప‌ర్ పాపుల‌ర్ అయింది వ‌ర్ష‌. ముఖ్యంగా క‌మెడియ‌న్ ఇమ్మాన్యుయేల్ తో వ‌ర్ష చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఆన్ స్క్రీన్‌పై వీరిద్ద‌రి ల‌వ్ ట్రాక్, రొమాంటిక్ మూమెంట్స్ తెగ వైర‌ల్ అవ్వ‌డంతో.. ఇటు వ‌ర్ష‌కు, అటు ఇమ్మాన్యుయేల్ కు మంచి క్రేజ్ వ‌చ్చింది.

ఇదిలా ఉంటే.. రెండో రోజుల క్రితం వ‌ర్ష బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నా అంటూ తన చేతికి పెట్టుకున్న ఉంగరాన్ని, మంగళసూత్రాన్ని చూపిస్తూ హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో వ‌ర్ష త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతోందంటూ ప్ర‌చారం జ‌రిగింది. అవును, నిజంగానే వ‌ర్ష పెళ్లి పీట‌లెక్కింది. ఈమె పెళ్లాడింది ఎవ‌ర్నో కాదు ఇమ్మాన్యుయేల్ నే. అయితే ఇది రియ‌ల్ కాదండోయ్‌.. రీలే.

శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేయగా.. ఇందులో యాంకర్ వర్ష ఇమ్మానుయేల్‌ని పెళ్లాడుతూ కనిపించింది. అంతే కాదు, వర్ష వెడ్స్ ఇమ్మానుయేల్ అంటూ వెడ్డింగ్ కార్డును హైలైట్ చేస్తూ.. సుమూహూర్తం జూలై 4న అంటూ సిల్లీ ప్రమోషన్స్‌కి తెర తీశారు. ఈ విష‌యంలో నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. రేటింగ్స్ కోసం ఇంకెంత మంది కమెడియన్లకు పెళ్లిళ్లు చేస్తారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. కాగా, గ‌తంలో సుధీర్-రష్మిల పెళ్లిని కూడా ఇలాగే చేసి మల్లెమాల మంచి రేటింగ్ సాధించిన సంగ‌తి తెలిసిందే.

Share post:

Popular