బ్రేకింగ్: తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపు.. !?

    సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రగతి భవన్‌ లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా లాక్‎ డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్ డౌన్ ను పొడగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ను జూన్ 10 వరకు పొడగించనున్నట్లు సమాచారం అందుతోంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వీకెండ్ లో సంపూర్ణంగా లాక్ డౌన్ విధించనున్నట్లు సమాచారం.

    ఈ సమావేశంలో లాక్‌ డౌన్‌ తో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే లాక్ ‎డౌన్ కఠినంగా అమలువుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతించడం లేదనే విషయం తెలిసిందే.