బ్రేకింగ్ : తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం..!

నేడు తెలంగాణలో నాగార్జున సాగరు ఎన్నికల ఫలితాలు విడుదల అవ్వబోతున్నాయి. అందులో టిఆర్ఎస్ పార్టీ విజయము సొంతం చేసుకోవడంతో తెలంగాణ భవన్లో ఆనందోత్సాహం నెలకొన్నది. ఈ ఉత్సాహంలో భాగంగా పార్టీ కార్యకర్తలు ఆనందంతో బాణసంచా కాలుస్తూన్న క్రమంలో నిప్పురవ్వలు భవన్లో ఉన్న చలువ పందిరిపై పడ్డాయి. దీనితో ఒక్క సారిగా చలువ పందిరికి మంటలు అంటుకున్నాయి. ఇలా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడున్న వాళ్లంతా భయముతో ఉలిక్కి పడ్డారు. అక్కడున్న వాళ్లు కొందరు వెంటనే అప్రమత్తమై మంటలు ఆపేందుకు ప్రయత్నం చేశారు.

కొంత మంది పార్టీ కార్యకర్తలు అగ్నిమాపక సిబ్బందికి పార్టీ కార్యకర్తలు విషయాని తెలియజేశారు. సమాచారము అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. దీనితో పెను ప్రమాదం తప్పింది. నాగార్జున సాగరు ఉప ఎన్నికలు టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయము దిశగా దూసుకెళ్లడంతో అటు సాగర్ తో పాటు ఇటు హైదరాబాద్లోనూ కార్యకర్తలు, టిఆర్ఎస్ అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాలు ఘనంగా చేసుకుంటున్నారు. ఏది ఏమైనా కానీ.. సకాలములో ఫైర్ సిబ్బంది వారు తెలంగాణ భవానికి చేరుకోవడం, మంటలను అదుపులోకి తీసుకోని రావడంతో పార్టీ కార్యకర్తలు ఉపిరి పీల్చుకున్నారు.

Share post:

Latest