వారికీ అండ‌గా ర‌కుల్..?

క‌రోనా మ‌హ‌మ్మారి పేద‌, ధ‌నిక అనే తేడా లేకుండా అంద‌రితో చెల‌గాట‌మాడుతోంది. స‌రిప‌డ ఆక్సిజ‌న్‌, బెడ్స్ దొర‌క‌క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ చూడ‌ని విషాధాన్ని భార‌త్ ఎదుర్కొంటోంది. ఇక భార‌త్‌ను ఈ క‌ష్ట‌కాలం నుంచి భార‌త్‌ను బ‌య‌ట‌ప‌డేయ‌డానికి అంతా ఏకమ‌వుతున్నారు. ముఖ్యంగా సెల‌బ్రిటీలు త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. ఆక్సిజ‌న్‌, బెడ్స్ స‌మ‌కూర్చ‌డం కోసం విరాళాలు సేక‌రిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా ప్రియాంక చోప్రా, ఆమె భ‌ర్త జోన‌స్ కోవిడ్ బాధితుల కోసం గీవ్ ఇండియా పేరుతో ఓ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఈ మంచి కార్య‌క్ర‌మంలో ఎంతో మంది సెల‌బ్రిటీలు భాగ‌స్వామ్యం అవుతున్నారు. నటి ర‌కుల్ ప్రీత్ కూడా ఇప్ప‌టికే త‌న స్నేహితుల ద్వారా కొంత ధనాన్ని పోగు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సేక‌రించిన నిధుల‌తో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు సమకూర్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ర‌కుల్ చేస్తున్న మంచి ప‌ని విజ‌యవంతం కావాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు.

Share post:

Latest