పంజాబ్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌ కు శాస్త్ర చికిత్స..?

అపెండిసైటిస్‌తో హాస్పిటల్ లో చేరిన పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌కు సోమవారం రోజున సర్జరీ జరిగింది. తీవ్ర కడుపు నొప్పితో రాహుల్‌ ఆదివారం ఆస్పత్రిలో చేరాడు. రాహుల్ వరం తరువాత తన కార్యక్రమాలు మొదలు పెట్టవచ్చని డాక్టర్స్ తెలిపారు. కాబట్టి రాహుల్‌ను తిరిగి బయో బబుల్‌లోకి అనుమతించడం పై ఐపీఎల్‌ అధికారులతో పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ చర్చ జరపనుంది. బబుల్‌లో అడుగు పెట్టడానికి ముందు రాహుల్‌ హోటల్లో వారం రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండాలి.

దీనితో రాహుల్ మరో రెండు వారాల్లో జట్టుతో కలవనున్నాడు. గత శనివారం రాత్రి తీవ్ర కడుపు నొప్పితో బాధపడిన రాహుల్‌‌ను టీమ్ ఫిజియో పరిశీలించి, అపెండిసైటిస్‌ అని చెప్పారు. దీనితో కేఎల్ రాహుల్‌కు సర్జరీ చేయటానికి వెంటనే ఆసుపత్రికి తరలించారు. సర్జరీ అయిన తరువాత రాహుల్ వారం రోజుల్లో కోలుకుంటాడని అంటున్నారు. రాహుల్ బయో బబుల్ ప్రవేశించాలన్నా మరో వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల కారణంగా రాహులకి కొన్ని పరీక్షలు చేసిన తర్వాతే ఆయన జట్టుతో కలిసే అవకాశం వస్తుంది.

Share post:

Popular