వైరల్‌: తీన్మార్‌ స్టెప్పుతో రెచ్చిపోయిన శృతి..!?

త్వరలో తమిళనాడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టేశారు. విశ్వనటుడు కమల్‌ హాసన్‌ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజాకర్షణ లక్ష్యంగా ఆగమేఘాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. కమల్‌కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీ నటి, ఆయన అన్న చారుహాసన్‌ కుమార్తె సుహాసిని కూడా సుడిగాలి ప్రచారంలో భాగమయ్యారు.

- Advertisement -

అయితే కమల్‌కు మద్దతుగా సినీ నటి, ఆయన అన్న చారుహాసన్‌ కుమార్తె సుహాసిని ప్రచారంలో పాల్గొన్నారు. సుహాసినికి తోడుగా కమల్‌ చిన్నకూతురు అక్షర హాసన్‌ కూడా క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. ప్రచారంలో భాగంగా కమల్‌కు ఓటేయడంటూ అక్షర, సుహాసిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. మధ్య మధ్యలో డప్పు చప్పుళ్లకు తీన్మార్‌ డ్యాన్స్‌లు వేస్తూ జనాలను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం) పార్టీ నుంచి కమల్ పోటీ చేస్తున్నారు.

Share post:

Popular