ఫ్లాష్ న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ లో కాల్పులు..కారణం ఏమిటి..?

ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో అలజడి రేగింది. కాసేపటి క్రితం కూకటపల్లిలో హెడ్ డీ ఎఫ్ సి ఎటిఎం వద్ద కాల్పులు జరిగాయి. ఇద్దరు సెక్యూరిటీ గార్డుల పై కాల్పులు జరిగాయి. ఎటిఎంలో డబ్బులు నింపే టైములో ఈ కాల్పులు జరిగాయని సమాచారం. చోరీ చేసి దుండగులు డబ్బులను తీసుకువెళ్ళారు అని గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసారు.

కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతుకుతున్నారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఈ కాల్పులకు దిగారా అనే దాని పై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కాల్పుల్లో గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం బానే ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ లో కొన్నాళ్ళుగా ఉగ్రవాద దాడులు పూర్తిగా ఆగిపోయాయి. ఈ క్రమంలో జరిగిన ఈ దాడులు పెద్ద సంచలనంగా మారింది.

Share post:

Popular