హిట్ మ్యాన్ కి జరిమానా… ఎందుకో తెలుసా..?

చెపాక్‌ స్టేడియంలో మంగళవారం రాత్రి డిఫెండింగ్‌ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబయి పై దిల్లీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రోహిత్ సేన, అమిత్‌ మిశ్రా అద్భుతమైన రీతిలో బౌలింగ్‌ చేయడంతో 9 వికెట్లకు 137 పరుగులే చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ స్లో ఓవర్‌ రేట్ నమోదు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబయికి ఇది మొదటి ఉల్లంఘన కావడంతో ఐపీఎల్ ప్రవర్తనా నియామవళి ప్రకారం, ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్ శర్మకు రూ.12 లక్షల ఫైన్ విధించారు.

ఇది రెండోసారి పునరావృతమైతే రూ.24 లక్షల జరిమాన విధించడంతో పాటు టీం జట్టు కెప్టెన్‌ సహా ఆ మ్యాచ్‌కు నెక్స్ట్ జట్టులో ఉన్న ఆటగాళ్లందరికి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తారు. ఇక మూడోసారి కూడా స్లో ఓవర్‌ రేట్ నమోదు అయితే, ఆ కెప్టెన్‌ను ఒక మ్యాచ్‌ నుండి నిషేదించటంతో పాటు రూ.30 లక్షల జరిమానా కూడా విధిస్తారు.

Share post:

Latest