పెళ్లి పీటలు ఎక్కబోతున్న గుత్తా జ్వాల..!

ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ గుత్తా జ్వాల తన వివాహపు తేదీని ప్రకటించింది. గత కొన్నాళ్లుగా తమిళ నటుడు విష్ణు విశాల్ తో ఈ భామ ప్రేమలో ఉంది. క‌రోనా లాక్ డౌన్ టైములో ఈ జంట నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. అతి తొందర్లోనే పెళ్లి తేదీ ప్రకటిస్తామని మొన్ననే విష్ణు విశాల్ చెప్పాడు. చెప్పిన‌ట్లే గుత్తా జ్వాల, విష్ణు విశాల్ త‌మ పెళ్లి తారీఖు ని సోషల్‌ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు.

ఇరు కుటుంబ స‌భ్యుల సమ్మతం ఇంకా ఆశీర్వాదమల‌తో మేము వివాహం చేసుకుంటున్నామని గుత్తాజ్వాల, విశాల్‌ లు చెప్పారు. కుటుంబ స‌భ్యులు, స్నేహితులు ఇంకా స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఈ నెల 22 వ తేదీన త‌మ‌ వివాహం జ‌రుగుతుంద‌ని వారు ప్రకటించారు. ఇన్నేళ్లుగా త‌మ‌ పై ప్రేమ అభిమానాలు చూపిస్తున్న అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ఈ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసారు.

 

 

 

<blockquote class=”twitter-tweet”><p lang=”und” dir=”ltr”>?? <a href=”https://t.co/d68O3xRSsv”>pic.twitter.com/d68O3xRSsv</a></p>&mdash; Gutta Jwala (@Guttajwala) <a href=”https://twitter.com/Guttajwala/status/1381860653707616259?ref_src=twsrc%5Etfw”>April 13, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Share post:

Latest