అక్టోబర్‌లో విడుదల అవ్వనున్న జేమ్స్‌ బాండ్‌ సినిమా..!

హాలీవుడ్ ప్రసిద్ధ జేమ్స్ బాండ్ సిరీస్‌లో 25 వ చిత్రం నో టైమ్ టు డై అక్టోబర్‌ నెలలో రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీమియర్‌తో ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు సమాచారం. కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మూసివేతకు గురయ్యాయి. ఈ సినిమా రిలీజ్ అప్పటి నుంచి నాలుగుసార్లు వాయిదా పడింది. నో టైమ్‌ టు డై సినిమాని మూడు ప్రధాన సంస్థలైన ఎంజీఎం, యూనివర్సల్, బాండ్ ప్రొడ్యూసర్స్ నిర్మించారు. ప్రపంచ సినిమాల్లో అతిపెద్ద ఫ్రాంచైజీ అయిన జేమ్స్ బాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఫాన్స్ ఉన్నారు.

- Advertisement -

బాండ్ చిత్రాల శైలి, యాక్షన్, పేస్, గాడ్జెట్లు భిన్నమైన థ్రిల్‌ను కలిగిస్తాయి. 2020 ఏప్రిల్ నుంచి నిర్మించిన ఈ మూవీ రెండవ ట్రైలర్ గత సంవత్సరం సెప్టెంబర్‌లో రిలీజ్ అయింది. ఇది ప్రేక్షకుల ఉత్సుకతను మరింత పెంచింది. కరోనా వ్యాప్తి తగ్గు ముఖం పట్టిన పక్షంలో ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబర్‌ నెలలోనే భారతదేశంలో రిలీజ్ చేస్తామని మేకర్స్‌ అన్నారు.

Share post:

Popular