కారు ప్ర‌మాదంలో సంగీత గాయ‌కుడు మృతి..!

పంజాబీ గాయ‌కుడు దిల్జాన్‌ మార్చి 30 న మంగ‌ళ‌వారం ఉద‌యం అమృత్‌స‌ర్ స‌మీపంలోని జండియాలా గురులో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. అమృత్‌స‌ర్ నుండి క‌ర్తార్‌పూర్ వెళుతుండ‌గా, దిల్జాన్ కారు జలంధర్ రోడ్డులో పక్కన ఆపి ఉంచిన ట్రక్కును ఢీ కొంది. ఈ ప్ర‌మాదంలో దిల్జాన్ అక్క‌డికక్క‌డే చనిపోయారు. ప్ర‌మాదానికి గ‌ల పూర్తి కార‌ణాలేంట‌నే దాని పై పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు. గాయ‌కుడి మృత ‌దేహాన్ని పోస్ట్ మార్టంకు తీసుకెళ్లారు. అయితే అతి వేగం వ‌ల‌న‌నే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు పోలీస్ ఆరు భావిస్తున్నారు.

దిల్జాన్ భార్య‌, పిల్ల‌లు గత కొన్నాళ్లుగా కెన‌డాలోనే ఉంటున్నారు. ఈ వార్త తెలిసి ఆయన కుటుంబ సభ్యులంతా శోక సంద్రంలో మునిగి పోయారు. ఆయ‌న మృతికి పంజాబీ సంగీత ప‌రిశ్ర‌మ అంతా సంతాపం తెలియచేసింది. చాలా మంది ప్ర‌ముఖులు త‌మ సోష‌ల్ మీడియా పేజ్‌లో దిల్జాన్‌కు సంతాపం చెప్తూ, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధించారు. ఆయన కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి కూడా తెలిపారు.

Share post:

Latest