మంటల్లో మణి ఆఫీస్:ఒకటే డౌట్!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆఫీసులో అగ్ని ప్రమాదం సంభవించడం సంచలనంగా మారింది. తన కార్యాలయంలో ఫైర్ యాక్సిడెంట్ తలెత్తడంపై మణి షాక్‌లో ఉన్నారట. ఆయనతో పాటూ టోటల్ కోలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. వివరాల్లోకి వెళితే.. మణిరత్నంకు చెన్నయ్ లోని అభిరామపురంలో ఒక ఆఫీస్ ఉంది. చాలా ఏళ్ల నుండి అదే కార్యాలయాన్ని వాడుతున్నారాయన. తన కొత్త సినిమా పనులు కూడా అక్కడే చేస్తుంటారు.

ఈ మధ్యే ఊటీలో తొలి షెడ్యూల్ షూటింగ్ ముగించుకుని వచ్చిన మణి.. ఇక్కడే తన సినిమా తాలూకు ఎడిటింగ్ పనులు కూడా చేయిస్తుంటారు. అయితే మంగళవారం తెల్లవారుజామున సడన్ గా అగ్ని ప్రమాదం జరిగింది. షార్టు సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అంతా భావిస్తున్నారు. ఈ ఘటనలో ఆఫీసులోని లక్షల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ తో పాటూ అంతకంటే విలువైన స్ర్కీప్టులు కూడా నాశనం అయిపోయాయట.

అయితే ఇప్పుడు అందరిలోనూ ఒకటే డౌట్. కార్తితో తెరకెక్కిస్తున్న కాట్రు వెలియాడై సినిమాకు సంబంధించిన ఫుటేజ్ కూడా డ్యామేజై ఉంటుందా అని. ఈ ప్రమాదంపై మణిరత్నం ఇప్పటివరకూ స్పందించలేదు.