పవన్ కాళ్ళు చేతులు తీసేస్తారు

పవర్ స్టార్ , జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో ప్రసంగించిన తరువాత ఇంకా రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి.పవన్ కళ్యాణ్ దాటికి ఆయన ప్రసంగించేసి వెళ్లిపోయారు..ఇంకేముంది అటు మీడియా కి ఇటు మిగిలిన పొలిటిషన్స్ కి మళ్ళీ పవన్ ప్రశ్నించే వరకు ఫుల్ టైంపాస్ అన్నట్టు తయారైంది పరిస్థితి.

ఎవరికీ తోచినట్టు వాళ్ళు పవన్ స్పీచ్ ని విశ్లేషిస్తూ విమర్శిస్తూనే వున్నారు.తాజాగా కర్నూల్ నుండి ఈ మధ్యనే టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన మాజీ కాంగ్రెస్ నాయకుడు టీజీ వెంకటేష్ గారు పవన్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ ఎంపీ లని ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు.రాజీనామా చేసెయ్యమనడానికి అసలు పవన్ కి ఏ రైట్ ఉంది..అయినా పవన్ కళ్యాణ్ మద్రాస్ లో ఇలా మాట్లాడితే అక్కడ పవన్ కళ్ళు చేతులు విరగ్గొట్టే వాళ్ళు .ఇక్కడ కాబట్టి చలామణి అవుతోంది అంటూ చెప్పుకొచ్చారు.

అయినా రాజకీయమంటే గడ్డలు పెంచడం..తీసేయడం కాదు అంటూ పవన్ కి ఛలోక్తులు విసిరారు టీజీ గారు.ఔను నిజమే రాజకీయంటే టీజీ గారిని చూసే నేర్చుకోవాలి.నిస్సిగ్గుగా పార్టీ లు ఎలా ఫిరానాయించాలో..నరం లేని నాలుకతో ఎలా మాట్లాడాలో టీజీ ని చూసే నేర్చుకోవాలి మరి.ఇక్కడ కాబట్టి సరిపోయింది కానీ అదే ఏ అరబ్ దేశం లోనో అయితే టీజీ లాంటి వాళ్ళను ఉరి తీసే వాళ్ళు..దీనికి ఏం సమాధానం చేతాడో పాపం టీజీ.