కలర్స్ స్వాతి పెళ్లికూతురాయనే!

తెలుగు బుల్లి తెరపై కలర్స్ ప్రోగ్రామ్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటి స్వాతి.ఆ  తర్వాత హీరోయిన్ గా తెలుగు, మళియాల ఇండస్ట్రీలో ఓ మెపు మెరిసింది. అష్టాచెమ్మ చిత్రంతో అద్భుత విజయం సొంతం చేసుకున్న ఈ అమ్మడు తర్వాత ఇక ఆగలేదు.అయితే గత కొంతకాలంగా అమ్మడి కెరియర్ కాస్త స్లో అవ్వడంతో ఈ కలర్ ఫుల్ చిలుక ఇపుడు పెళ్లి పీటలు ఎక్కడానికి రెఢీ అవుతుంది.కలర్స్ స్వాతి తన లైఫ్ టర్న్ తీసుకోనుంది.

ఎప్పటిలా కాకుండా తన లైఫ్ ను మరోలా ట్రై చేస్తానంటుంది.కార్తికేయ, స్వామిరారా లాంటి చిత్రాలతో హీరోయిన్ గా టాలీవుడ్లో మరింత మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా మళియాల భాషలో కూడా స్వాతి తన సత్తా చాటుకుంది.అయితే వచ్చిన ఇమేజ్ చాలనుకుందో ఏమో…త్వరలో మ్యారీజ్ కు రెఢీ అవుతుంది.బాజా భజంత్రీలకు అమ్మడు సై అనేసింది. ఈ మద్య తెలుగులో స్వాతికి పెద్దగా అవకాశాలు రావడం లేదు..ఆ మద్య త్రిపుర చిత్రంలో ఈ చిన్నది నటించింది.  స్వాతి తన ప్రతి సినిమాలోనూ మెప్పిస్తున్నా ఆమె మీద మన దర్శక నిర్మాతలు మాత్రం పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. ఇక స్వాతికి  29 ఏళ్ల వయసు కూడా వచ్చేసిన నేపథ్యంలో పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాలని స్వాతి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత రకరకాల రూమర్లు రావడం సహజం..అయితే ఆ మద్య స్వాతిపై కూడా కొన్ని రూమర్లు పుట్టుకొచ్చినా అవన్నీ ఖండింది. ప్రస్తుతం స్వాతి తల్లి ఆమె కోసం మంచి సంబంధాలు చూస్తున్నారట. అయితే స్వాతికి సినిమా ఇండస్ట్రీకి సంబంధింన వారా లేదా పారిశ్రామిక వేత్తా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఏడాది ఆఖర్లోపు స్వాతి పెళ్లి ఫిక్సయిపోవడం ఖాయం అంటున్నారు. హీరోయిన్లు కెరీర్ ముగిశాక చాలా వరకు వ్యాపారవేత్తల్ని పెళ్లి చేసుకుని సెటిలవుతుంటారు. లయ లాంటి వాళ్లు కొందరు డాక్టర్లను పెళ్లి చేసుకుని ఫారిన్లో సెటిలయ్యారు. మరి స్వాతిని చేసుకోబోయేవాడు ఏ ఫీల్డు వాడో చూద్దాం.