మృగాడు:2 వేల మంది అమ్మాయిలు

ఢిల్లీలో 1500 మంది మహిళలకు అసభ్యకరమైన వీడియో సందేశాలు, ఫొటోలు పంపి వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ గుర్తింపు పత్రాలతో పొందిన మూడు మొబైల్ సిమ్ కార్డులతో మహిళలను వేధిస్తున్న మహ్మద్ ఖాలీద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని ఈశాన్య ఢిల్లీ డీసీపీ విజయ్ సింగ్ తెలిపారు.నిందితుడిని పాత ఢిల్లీలోని సదర్ బజార్‌కు చెందిన వాడిగా గుర్తించినట్టు చెప్పారు.

గత కొద్దికాలంగా నిందితుడు ఇష్టం వచ్చిన నంబర్లకు ఫోన్‌చేస్తున్నాడు. ఒకవేళ ఆ మొబైల్ నంబర్లలో మహిళలు మాట్లాడినట్లయితే ఆయా నంబర్లను ఫీడ్ చేసుకొని వారికి అశ్లీల చిత్రాలను, వీడియోలు, అసభ్య జోకులు పంపుతున్నాడు అని సింగ్ వెల్లడించారు. ఖాలీద్ వద్ద దాదాపు 2 వేలకు పైగా మహిళల ఫోన్ నంబర్లు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో గుర్తించామన్నారు. కొద్దికాలంగా తనను వేధిస్తున్నాడని, ఆ వ్యక్తిని తాను బెదిరించడంతో చంపుతానని బెదిరిస్తున్నాడని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఖాలీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.