‘సెక్స్ అడిక్ట్’ గా అవసరాల శ్రీనివాస్

ఇప్పటివరకు చిన్న చితక రోల్స్ తో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకున్న నటుడు అవసరాల శ్రీనివాస్. ఊహలుగుసగుసలాడే చిత్రం తో మంచి బ్రేక్ సాధించిన శ్రీనివాస్ ఆతరువాత చిన్న పెద్దా సినిమాల్లో నటిస్తూ బిజీ గా మారిపోయాడు.కేవలం నటుడిగానే కాకుండా సినిమాలకి కథా మాటలు కూడా అందించే సత్తా ఉన్న నటుడు అవసరాల.

తాజాగా సాఫ్ట్ రోల్స్ మాత్రమే చేయకుండా బోల్డ్ రోల్స్ కూడా చేయడానికి రెడీ అవుతున్నాడీ తెలుగు కుర్రోడు.అందులో భాగంగానే బాలీవుడ్ అడల్డ్ కామెడీ ‘హంటర్రర్’ తెలుగు రీమేక్ లో లీడ్ రోల్ చేయనున్నాడు.ఈ సినిమాలో హీరో సెక్స్ అడిక్ట్.కేవలం బోల్డ్ సీన్స్ మాత్రమే కాదు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని శ్రీనివాస్ చెప్పాడు.

ఈ సినిమాలో చాలా వేరియేషన్స్ వున్నాయి.చాలా ఎమోషన్స్ వున్నాయి.అందుకే చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు అవసరాల.ఇది కేవం అడల్ట్ కామెడీ సినిమాగానే చూస్తున్నారు అందరూ,నావరకైతే స్టోరీ, నా కేరెక్టర్ కు లోతైన అర్థం ఉందని నేను భావిస్తున్న అందుకే ఈ సినిమాకు అంగీకరించా అంటున్నాడు అవసరాల.హీరోయిన్స్ గా రెజీనా,రాసి ఖన్నా నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.